స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన ఆండ్రియా…?

0

స్టార్ హీరో సూర్య కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అటు తమిళ ప్రేక్షకులే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించే స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లేటెస్టుగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య ‘వాడివసల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సూర్య కెరీర్ లో 40వ చిత్రంగా వస్తున్న ‘వాడివసల్’ నుండి విడుదలైన సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో సూర్య మెడలో తాడు పులిగోరుతో డిఫెరెంట్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా ని ఒక హీరోయిన్ గా తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు.

కాగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ చిత్రంలో ఆండ్రియా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ క్రమంలో ‘వాడివసల్’ లో కూడా ఆండ్రియాను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య – ఆండ్రియా పాత్రలు పోటాపోటీగా ఉంటాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు హరి దర్శకత్వంలో ‘అరువా’ అనే మూవీలో నటిస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.