Templates by BIGtheme NET
Home >> Cinema News >> #MB విలన్ గా కపూర్.. ఓసారి ఆలోచించాలి!

#MB విలన్ గా కపూర్.. ఓసారి ఆలోచించాలి!


ప్రస్తుతం ఇండస్ట్రీస్ లో నటవారసత్వం.. స్వాభిమానంపై చర్చ సాగుతోంది. బాలీవుడ్ ఇన్ సైడర్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో నెపోటిజాన్ని ప్రోత్సహించే స్టార్లకు వెటరన్స్ కి ఇబ్బంది తప్పేట్టు లేదు. నెటిజనులు ఇష్టానుసారం దూషించడం.. వారి సినిమాల ట్రైలర్లకు ప్రమోషనల్ వీడియోలకు డిస్ లైక్ లు కొట్టడం.. అలాగే వారి సినిమాల్ని నిరాదరణకు గురి చేయడం వగైరా వగైరా ఎటాక్ లు చూస్తూనే ఉన్నాం.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో సూపర్ స్టార్ మహేష్ సినిమా `సర్కార్ వారి పాట` (ఎంబీ 27) కోసం నెపోటిజంకి మద్ధతు పలికే స్టార్ అనీల్ కపూర్ ని పరశురామ్ సంప్రదించారని కథనాలొచ్చాయి. మహేష్ కి ధీటైన విలన్ ఎవరు? అని వెతికిన పరశురామ్ కి అనీల్ కపూర్ కనిపించడం బాగానే ఉంది కానీ.. ఇప్పుడున్న వాతావరణంలో అతడి వల్ల నష్టం కలుగుతుందేమోనన్న సందేహం వ్యక్తమవుతోంది. హిందీ ఆడియెన్ ఇప్పటికే సుశాంత్ ఇష్యూతో మరిగిపోతున్నారు. కపూర్లు.. ఖాన్లు సహా చోప్రాలు భట్స్ అంటే తిట్టి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో కపూర్ ని ఈ భారీ చిత్రం కోసం దించడం సరైనదేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇక అనీల్ కపూర్ కాకుండా వేరే ఎవరున్నారు? అన్నది ఆరా తీస్తే.. బాలీవుడ్ లో విలన్లకు కొదవేం ఉంది? ఎందరో ఉన్నారు. బాలీవుడ్ ఇన్ సైడర్ కాకుండా ఔట్ సైడర్ నే తీసుకునే ఆలోచన చేస్తే మంచిదేమో అన్న సూచన సోషల్ మీడియాల్లో చేస్తున్నారు. మరి మహేష్ కానీ.. పరశురామ్ కానీ ఈ విషయంపై ఆలోచిస్తారేమో చూడాలి. స్టార్ డమ్ పరంగా అనీల్ కపూర్ గొప్ప ఎంత ఉన్నా.. ఇప్పుడున్న సీన్ లో అతడిని ఎంపిక చేయడం సరికాదన్న అభిప్రాయం నెటిజనుల్లో బలంగానే ఉంది. `రేస్` సిరీస్ సహా ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ చిత్రంలో నటించిన అనీల్ కపూర్ ఫన్నీ క్యారెక్టర్లలో బలమైన ముద్రనే వేసిన సంగతి విధితమే. బహుశా అందుకే కపూర్ ని పరశురామ్ ప్రిఫర్ చేస్తున్నారేమో!