మరో ‘దృశ్యం’ సిద్దం.. వెంకీ సిద్దమేనా?

0

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. మీనా ప్రధాన పాత్రల్లో 2013లో వచ్చిన దృశ్యం సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు.. తమిళం.. హిందీలో కూడా రీమేక్ అయిన దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దృశ్యం సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ గత రెండేళ్లుగా చర్చలు జరిపారు. మొదటి పార్ట్ లోని పాత్రలను తీసుకుని రెండవ దృశ్యంకు కథను అల్లడంతో మోహన్ లాల్ వెంటనే నటించేందుకు సిద్దం అయ్యాడు. గత ఏడాదిలోనే ప్రారంభం అయినా కూడా కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది.

కరోనా లాక్ డౌన్ లోనే సినిమాను జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్ల మద్య షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా అధికారికంగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే థియేటర్లు ఓపెన్ అయితే వచ్చే నెలలో క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక వేళ థియేటర్లు వచ్చే నెలలో పూర్తి స్థాయిలో రన్ అవ్వకుంటే ఎప్పుడు అయితే థియేటర్లు కేరళలో పూర్తి స్థాయిలో మొదలు అవుతాయో అప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు.

దేశ వ్యాప్తంగా దృశ్యం 2 సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే అన్ని భాషల్లో కూడా దృశ్యం కు అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ దృశ్యం సినిమా మంచి వసూళ్లను కూడా నమోదు చేసింది. ఇప్పుడు దృశ్యం 2 కు వెంకీ రెడీగా ఉన్నాడా అనేది చూడాలి. మలయాళంలో రూపొందిన ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వెంకీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.