సంజనకు సంబంధించి మరో షాకింగ్ నిజం బయటకు

0

శాండల్ వుడ్ లో డ్రగ్స్ రాకెట్ కేసు యమా ఫాస్టుగా వెళుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నటీమణుల్ని పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. ప్రస్తుతం వారు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో సంజనా ఒకరు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఆమెకు సంబంధించిన ఒక అంశం బయటకు తాజాగా బయటకు వచ్చింది.

డ్రగ్స్ రాకెట్ లో కీలకంగా మారిన సంజనకు బోలెడన్ని ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని విచారణలోనూ సంజన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. రెండేళ్ల క్రితం నటి సంజన మతం మారిన వైనం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

2018లోనే ఆమె బెంగళూరులోని దారుల్ ఉలుమ్ షా వలి ఉల్లామ్ మసీదు ద్వారా ఇస్లాంలోకి మారినట్లుగా సర్టిఫికేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇస్లాంలోకి మారిన తర్వాత సంజనా తన పేరును మహిరాగా మార్చుకున్నట్లుగా ఆ పత్రంలో పేర్కొన్నారు. తాను మతం మారిన విషయాన్ని ఇప్పటివరకూ సంజన బయటపెట్టింది లేదు.

అంతేకాదు.. పోలీసు విచారణలో ఆమె డాక్టర్ అజీజ్ పాషాతో ఎంగేజ్ మెంట్ అయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమెకు చూపించిన పోలీసులు వివరాలు అడగటంతో సైలెంట్ గా ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజనకు సంబంధించి మరెన్ని విషయాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.