కపిల్ బయోపిక్ ఓటీటీలోనే.. అభిమానులకు పండగే!

0

లెజెండరీ క్రికెటర్ ఇండియాకు తొలి వరల్ట్ కప్ తీసుకొచ్చిన కపిల్దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ భారీ బయోపిక్ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ కపిల్దేవ్ గా కనిపించబోతుండగా… కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయ్యింది. అయితే గత మార్చిలోనే చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ దెబ్బ తో బ్రేక్ పడింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత పాన్ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా థియేటర్ల లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్టు కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ఈ చిత్రాన్ని అన్నిభాషల్లో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ తో ముందుకొచ్చిందట. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే సూచనలు కనిపించక పోవడం తో.. ఓటీటీ లో విడుదలకే చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారని ముంబై సినీవర్గాల టాక్. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కబీర్ఖాన్ ఎంతో ప్రతిష్ఠాత్మకం గా తెరకెక్కించారు. 80ల నాటి కథ కావడం తో దర్శకుడు ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఓటీటీ లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్సవుతారన్న కారణం తో ఇంత కాలం రిలీజ్ ను ఆపారు. అయితే కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.