నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే.. డబ్బు విలువ తెలుసు

0

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయినుగా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో కొంటె చూపులతో మిలియన్ల సంఖ్యలో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అనుపమ అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో లేదో తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ తో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్లింది.

తన డబ్బింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుంది. తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరితో నటించింది. శతమానం భవతి ఉన్నది ఒకటే జిందగీ కృష్ణార్జున యుద్ధం హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.

ఇక గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. అమ్మడు తాజాగా జీవితంలో తను డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత బయట పెట్టింది. “చిన్నప్పటి నుంచి నేనూ ఓ సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే పెరిగాను. అందుకే నాకు ఆర్థికపరమైన విషయాల్లో అవగాహన ఉంది. కానీ డబ్బుల గురించి అదేపనిగా పట్టించుకోను. నాకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో తెలుసు. కానీ ఆ తర్వాత విషయాలన్నీ మా పేరెంట్స్ చూసుకుంటారు. పర్సనల్ లైఫ్ కోసం ఎక్కువ డబ్బు అవసరం లేదనేది నా అభిప్రాయం. అయినా నాకు డబ్బుతో పెద్దగా పనేం ఉంటుంది? షాపింగ్ అంటే ఇష్టం లేదు. బయటకి కూడా అప్పుడప్పుడు వెళ్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలేమో అనిపిస్తుంది. యాక్టింగ్ సినిమా.. ఈ రెండు తప్ప నాకు మరో పిచ్చి లేదు. ప్రయాణించడానికి ఒక కారు ఉండటానికి మంచి ఇల్లు చాలు” అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాలు భామ. ఈ మాటలు వింటూ అనుపమ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.