విరుష్క జంట వారసుడొస్తున్నాడహో..!

0

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట నుంచి శుభవార్త వచ్చేసింది. ఈ జంట త్వరలో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆ మేరకు స్వయంగా విరుష్క జంట అధికారిక ప్రకటనను చేశారు.

బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడే సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. “మేము ముగ్గురు ..“ అంటూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్లడించారు. మొత్తానికి జూనియర్ విరాట్ ఆగమానికి సమయం వచ్చేసిందన్నమాట.

ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విరుష్క ఫ్యాన్స్ అభినందన సందేశాలు పంపారు. అనుష్క (32).. విరాట్ మొదటిసారి తల్లిదండ్రులవుతున్నారు. వివాహం చేసుకుని మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వచ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఈ నెలలో బాలీవుడ్ నుండి వచ్చిన రెండవ గర్భస్థ శిశువుకు సంబంధించిన ప్రకటన ఇది. బెబో కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్ కొన్ని వారాల క్రితం మరో బిడ్డకు జన్మనిస్తున్నామని ప్రకటించారు. కరీనా- సైఫ్ కు ఇప్పటికే వారసుడు తైమూర్ ఉన్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ తో కలిసి `జీరో`లో చివరిసారి కనిపించిన అనుష్క శర్మ 2017 లో విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది.