ప్రభాస్ ని బీట్ చేసిన అనుష్క…!

0

‘కింగ్’ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బొమ్మాళీ అనుష్క శెట్టి భారీగా ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ హడావిడి చేస్తుంటే అనుష్క మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అయినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో అనుష్క సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా ఫేస్ బుక్ లో అత్యధిక లైక్స్ అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీగా అనుష్క శెట్టి నిలిచింది. స్వీటీని ఫేస్ బుక్ లో అనుసరించేవారి సంఖ్య 23 మిలియన్స్ దాటింది. అంతేకాకుండా 14 మిలియన్ ప్లస్ లైక్స్ సంపాదించుకుంది. ఫాలోవర్స్ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని సైతం అనుష్క బీట్ చేసి టాప్ లో నిలిచిందని చెప్పవచ్చు. ప్రభాస్ కి పేస్ బుక్ లో 19 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కు 17 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక లైక్స్ విషయంలో అల్లు అర్జున్ 13 మిలియన్స్.. ప్రభాస్ 10 మిలియన్ లైక్స్.. సమంత 9 మిలియన్ లైక్స్ తో కొనసాగుతున్నారు. ఈ విషయంలో కూడా బొమ్మాళి టాప్ ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్విటర్ లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే.. నాకు సిగ్గు ఎక్కువ అందుకే దూరంగా ఉన్నానని అనుష్క సమాధానం చెప్పింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో అనుష్క కి 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.