Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్

సుశాంత్ డ్రగ్స్ వల్లే ఆత్మహత్య.. రియా అరెస్ట్ తో న్యాయం ఓడిపోయిందన్న లాయర్


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐ చెంతకు చేరింది. అక్కడ విచారణ సందర్బంగా కూడా ఈ కేసుతో డ్రగ్స్ జోక్యం ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందని ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు అయిన శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నేడు రియా చక్రవర్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ విషయమై రియా చక్రవర్తి తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కక్ష సాధింపు చర్య అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. న్యాయం ఓడిపోయింది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇల్లీగల్ మందులు వాడి డ్రగ్స్ కూడా అలవాటు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది. అలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు రియాను మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒకేసారి మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆమెను టార్గెట్ చేయడంతో న్యాయం ఓడిపోయింది.

విచారణ పేరుతో ఆమెను తీవ్రంగా హింసించారు.. వెంటాడారు అంటూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఒక లాయర్ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. వారు నిర్దోషులు అయితే నిరూపించి బయటకు తీసుకు రమ్మంటూ సుశాంత్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.