వ్యక్తిగత జీవితం కోసం స్టార్ డమ్ ని కూడా వదిలేసి వెళ్లిపోయే నాయికలు ఉన్నారు. కానీ అనుష్క శర్మ అలా కాదు. జనవరిలో ఇలా డెలివరీ అయిపోగానే అలా తిరిగి షూటింగుల్లో జాయినయిపోతానని అంది. అనుష్క శర్మ ఆగస్టులో తన గర్భధారణ వార్తలను పంచుకుంది. గత కొన్ని నెలలుగా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె పని నుండి బ్రేక్ మోడ్ లోకి వెళ్లిపోయి కాసేపు కెమెరాల నుండి దూరంగా ఉంటుందని చాలామంది భావించినా..ఊహించని రీతిలో షాకిచ్చింది.
కొన్ని బ్రాండ్ ఒప్పందాల కట్టుబాట్ల కోసం షూటింగ్ చేయడానికి తిరిగి వచ్చింది. కోవిడ్ నిలువరించేలా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని యాడ్ షూట్లు చేశారని ఆమె బృందానికి ఆమెకు భద్రతా-బబుల్ ఉందని తెలిసింది.
2021 జనవరిలో మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామని విరుష్క జంట ఇదివరకే తెలిపారు. ఫ్రెగ్నెన్సీతో సెట్ లో తన ఇటీవలి అనుభవం గురించి అనుష్క మాట్లాడుతూ “సెట్లో ఉండటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మునుముందు కొద్ది రోజులు నేను నిరంతరం షూటింగ్ లో పాల్గొంటాను. ఇలా సెట్ లో ఉండటం చాలా బాగుంది. నా మొత్తం జట్టును కలవడం షూటింగ్ పిచ్చిలో మునిగిపోవడం సంతోషమే. ఈ సంవత్సరం సినీ పరిశ్రమకు కఠినమైనది. కానీ మునుపటిలానే అభిరుచి శక్తితో పునః ప్రారంభించడం సంతోషాన్నిస్తోంది“ అని అనుష్క అంది.
మహమ్మారి సమయంలో షూట్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించానని అనుష్క చెప్పారు. అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రోటోకాల్ పాటించారని తెలిపారు.
ప్రకటనల షూట్ సమయంలో మొత్తం సిబ్బంది COVID-19 పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకున్నారట. వ్యక్తిగత సేవికుల బృందం కూడా గర్భవతి అయిన తనకు చాలా రక్షణగా నిలిచారట. వారు తనని పూర్తిగా నిర్బంధించారని .. షెడ్యూల్ సమయంలో పని వాతావరణానికి వెలుపల వ్యక్తులను కలవనివ్వలేదని వారు నిర్ధారించారు.
ఆ కఠినమైన చర్యలను చూస్తే అనుష్కకు షూటింగ్ సులువుగా అయ్యిందని తెలిపింది. అయితే మాస్క్ లేకుండా కెమెరాను ఎదుర్కోవలసి రావడం వల్ల ప్రమాదం ఉందని భావించినా..జాగ్రత్తపడ్డానని అనుష్క తెలిపారు.
తన బిడ్డ పుట్టిన తరువాత సినిమాల షూటింగులకు వెళతారా? అన్న ప్రశ్నకు.. “నేను నా బిడ్డను ప్రసవించిన తర్వాత నేను నా సినిమాల షూట్స్కు తిరిగి వస్తాను. ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. పిల్లలు.. ఇల్లు .. వృత్తి జీవితం ఇదే ముఖ్యం. నేను జీవించినంత కాలం పని చేస్తూనే ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నటన నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది” అని అనుష్క వెల్లడించింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
