Templates by BIGtheme NET
Home >> Cinema News >> నగరంలో ప్రత్యక్షమైన దేవసేన.. పిక్స్ వైరల్!

నగరంలో ప్రత్యక్షమైన దేవసేన.. పిక్స్ వైరల్!


‘భాగమతి’ సినిమా తర్వాత ‘నిశ్శబ్ధం’ అనే సినిమాలో నటించింది స్వీటీ అనుష్క. ఆ మూవీ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమాకు కమిట్ అవ్వలేదు దేవసేన. దీంతో.. స్వీటీ సినిమా ముచ్చట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆ న్యూస్ కన్నా ముందు తనే దర్శనమిచ్చింది అనుష్క.

కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా అభిమానులను నిరాశకు గురిచేసిన స్వీటీ.. హైదరాబాద్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత కనిపించడంతో మీడియాతోపాటు అభిమానులు ఫొటోల మీద ఫొటోలు తీసుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చిందంటే ఏదో సినిమా కోసమే అనుకుంటున్న ఫ్యాన్స్.. త్వరలోనే వెండితెరపై చూసే అవకాశం ఉందంటూ ఖుషీ అవుతున్నారు.

అనుష్క నటన గురాంచి చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది స్వీటీ. ఈ స్పెషల్ క్వాలిటీ.. పరిశ్రమలో మిగతా హీరోయిన్ల నుంచి అనుష్కను వేరుచేసి ప్రత్యేకంగా నిలుపుతోంది. ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘భాగమతి’ ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన అనుష్క.. రాబోయే సినిమా ఎవరితో చేస్తుందో చూడాలి.