‘బాలయ్య-బోయపాటి’ సినిమాను ఫ్యాన్స్ మర్చిపోతున్నారా..??

0

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బాలయ్యకు హిట్టు తప్పనిసరి అయిపొయింది. ఇప్పుడు బాలయ్య తనకు రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో తెలిసిందే. ఇప్పుడు బాలయ్య అభిమానులలో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలయ్య అభిమానులకు దర్శకుడు బోయపాటి పై ఎనలేని నమ్మకం ప్రత్యేక అభిమానం ఉంది. ఎందుకంటే వేరే హీరోలను ఎలా చూపించినా బాలయ్యను మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తాడు. నడకలో.. మాటలో.. డైలాగ్స్.. యాక్షన్ అంతా కూడా హై డోస్ లో ఉంటాయి.

ఇప్పటికే బోయపాటి బాలయ్య కాంబినేషన్లో రూపొందిన సింహ లెజెండ్ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాయి. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాములుగా తన సినిమాల పోస్టర్స్ గాని గ్లిమ్ప్స్ గాని విడుదల చేస్తూ సినిమా పై అభిమానులలో అటెంషన్ పోకుండా ప్లాన్ చేస్తాడు. కానీ బిబి3 నుండి మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అభిమానులలో.. సినీవర్గాలలో రోజురోజుకి సినిమా పై ఆసక్తి కూడా తగ్గిపోతుందని టాక్. కరోనా టైంలోనే బాలయ్య మాస్ టీజర్ వదిలిన బోయపాటి బాలయ్యలు సినిమా నుండి ఏదైనా ఇంటరెస్టింగ్ న్యూస్ బయట పెడతారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందే కరోనా వలన షూటింగ్ ఆగిపోయిన లిస్ట్ లో చేరిన బిబి3 కనీసం అప్డేట్స్ ఇవ్వకపోతే అభిమానులు పూర్తిగా సినిమా గురించి మర్చిపోయే అవకాశం ఉందని సినీవిశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్ అంశాలతో పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్న బోయపాటి ఏదైనా అప్డేట్ అందిస్తాడేమో చూడాలి మరి!