Templates by BIGtheme NET
Home >> Cinema News >> OTT కి అమ్ముకుని లాభాలార్జిస్తే థియేటర్లు ఎందుకు?

OTT కి అమ్ముకుని లాభాలార్జిస్తే థియేటర్లు ఎందుకు?


తెలుగు హీరోలు నిర్మాతల మైండ్ సెట్ అమాంతం మారుతోంది. కరోనా పాఠాలు కొత్త ఐడియాలజీని డెవలప్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి! అన్న రొటీన్ థాట్ నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. థియేటర్లు దొరకవని.. ఆ నలుగురు అడ్డేస్తారనే గోలకు చెక్ పెట్టేస్తూ ఓటీటీ బలం పుంజుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనివల్ల స్టార్ల మధ్య పోటీ ఉండదు. స్టార్ డమ్ అన్న పదానికి విలువ అమాంతం పడిపోతోంది. ఇది ఊహించని సరికొత్త పరిణామం. దీనివల్ల మునుముందు నెపోటిజం.. అనే తలనొప్పి వ్యవహారం కూడా కనిపించదేమో!

ఇటీవల వరుసగా తెలుగు సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజైపోవడం ఇండస్ట్రీకి ఒక కోణంలో కలిసి వస్తోందనే చెప్పాలి. తాజాగా నాని – సుధీర్ బాబు మల్టీస్టారర్ వీ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతోంది. తదుపరి వరుసగా డజను సినిమాలు ఓటీటీ వేదికలపై రిలీజ్ కానున్నాయి. కీర్తి సురేష్ `మిస్ ఇండియా` రాబోయే నెలల్లో నేరుగా ఓటీటీలో ప్రసారం కానుంది. నిర్మాతలు నెట్ఫ్లిక్స్ తో చక్కని డీల్ ముగించారని తెలుస్తోంది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఫ్లాపైనా ఆ ప్రభావం ఈ సినిమా ఓటీటీ బిజినెస్ పై ప్రభావం చూపలేదని చెబుతున్నారు.

ఒకవేళ ఇదే నిజమైతే ఇతర ఓటీటీ రిలీజ్ లకు ఇది మేలైన సూచనే. ఈ వేదికపై బాక్సాఫీస్ లెక్కలతో పనే లేదు కాబట్టి.. ఓటీటీలో రిలీజవ్వడానికి ఎలాంటి అడ్డంకి కావడం లేదని కీర్తి మూవీ బిజినెస్ నిరూపించినట్టు. మునుముందు ఫలానా నిర్మాత సినిమా అన్న బ్రాండ్ తో పని లేకుడా కూడా ఓటీటీ రిలీజ్ లకు ఆస్కారం కలిగితే అది కూడా మంచికే. కొత్త వాళ్లకు మంచి ఉపాధి దొరుకుతుందనడంలో సందేహమేం లేదు.