భయ్యా అంటుంది.. అయినా మావి వేరు వేరు ఫ్యామిలీలే

0

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి రెండవ భార్య కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోనీ కపూర్ రెండవ భార్య శ్రీదేవి అనే విషయం తెల్సిందే. శ్రీదేవి తో వివాహంకు ముందు అర్జున్ కపూర్ తల్లిని పెళ్లి చేసుకున్న బోనీ కపూర్ విడాకులు తీసుకున్నాడు. అందువల్ల అర్జున్ కపూర్ కు చిన్నప్పటి నుండే శ్రీదేవి కుటుంబం అంటే ఒకింత కోపం మరియు అసహనం ఉంటూ ఉండేదట. అయితే కాల క్రమేనా శ్రీదేవిపై మరియు ఆమె కుటుంబ సభ్యులపై కోపం తగ్గడం మొదలయ్యింది. శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె కూతుర్లు ఇద్దరికి అర్జున్ కపూర్ మరింత దగ్గర అయ్యాడు.

అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. జాన్వీ తనను అర్జున్ భయ్యా అంటూ పిలుస్తుంది. అలా పిలిచిన సమయంలో ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతుంది. నా సొంత చెల్లి అన్షులా కూడా భయ్యా అని పిలుస్తుంది. కాని జాన్వి పిలిచిన సమయంలో మాత్రం విచిత్రంగా కొత్తగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా తనను అలా పిలవాల్సిందిగా చెప్పలేదు. తనే సహజ సిద్దంగా అలా పిలవడం నాకు సంతోషాన్ని కలిగించింది. జాన్వీ కి నేను ఒక అన్నగా కావాల్సిన సాయం అందించడంతో పాటు ఆమెకు ఎప్పుడు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చాడు.

ఇక జాన్వీ మరియు ఖుషి లతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నా కూడా మా కుటుంబాలు మాత్రమే వేరే అంటూ కామెంట్స్ చేశాడు. మేము అంతా ఒకటే అని మాత్రం నేను అబద్దం చెప్పలేను. తమది పరిపూర్ణ కుటుంబం అని నేను చెప్తే అది అబద్దం అవుతుంది. మా కుటుంబాల్లో ఇప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మెల్లగా అందరం కలిసి పోతామనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా అర్జున్ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జాన్వీ కపూర్ మరియు ఖుషి కపూర్ ల బాద్యలను తాను తీసుకుంటానంటూ కూడా ఒకానొక సమయంలో అర్జున్ వ్యాఖ్యలు చేశాడు.