పవన్ కు నాలుగో భార్యగా ఉండటానికి రెఢీనట.. బిగ్ బాస్ పోరి సంచలనం!

0

అభిమానలందు పవన్ అభిమానులు వేరయా అని చెప్పాలి. సినీ నటుల్ని సామాన్యులు విపరీతంగా అభిమానించటం మామూలే అయినా.. సెలబ్రిటీలు సైతం దేవుడిగా ఆరాధించే విషయంలో పవన్ కు సాటి వచ్చే వారే ఉండరు. సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఫలానా హీరో నా అభిమాని అని చెప్పుకోవటానికి చాలామంది హీరోయిన్లు సంకోచిస్తారు. కానీ.. అలాంటి వాటిని బ్రేక్ చేసిన ఇమేజ్ పవర్ స్టార్ దే. పవనిజం మొదలు ఆయన్ను దేవుడిలా కీర్తించే ధోరణి కనిపిస్తుంటుంది. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అంటూ తన్మయత్వంతో చెప్పేటోళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు.

సినిమా ఇండస్ట్రీలో పవన్ తమకు ఆరాధ్యదైవంగా చెప్పే హీరోలే కాదు హీరోయిన్లు కొందరున్నారు. నటి కమ్ బిగ్ బాస్ మాజీ కంటెంస్టెంట్ అశ్విని అలియాస్ అన్షూ రెడ్డి ఒకరు. పవన్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎంతంటే.. ఏకంగా ఆయన్ను దేవుడిగా చెప్పేస్తూ ఉంటుంది. అంతేనా.. తన ఫస్ట్ లవ్ ఇప్పటికి ఎప్పటికి పవనే నేని తేల్చి చెబుతూ ఉంటుంది. పవన్ కు వీరాభిమాని అయిన ఆమె..తాజాగా పవన్ ను కలిసింది. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫోటోను షేర్ చేసింది.

‘ఈ రోజు నా దేవుడ్ని కలుసుకున్నాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన పేరుపై వేయించుకున్న టాటూ కూడా ఆయనకు గుర్తుందని ఆయన చెప్పారు. తిరిగి వచ్చేటప్పుడు తన స్వహస్తాలతో రాసిన లెటర్ ఇచ్చారు. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ క్రిష్ కు కృతజ్ఞతలు’ అని చెప్పింది. పవన్ తో దిగిన ఫోటోతో పాటు.. ఆయన తనకు రాసిచ్చిన లెటర్ ను షేర్ చేసింది.

దీంతో..పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఒక నెటిజన్ ఒక అడుగు ముందుకు వేసి.. ఒకవేళ మీకు పవన్ కల్యాణ్ నాలుగో భార్యగా ఉండటానికి అవకాశం వస్తే ఒప్పుకుంటారా? అని ఊహించని ప్రశ్న వేశాడు. దానికి సీరియస్ కాని ఆమె.. కూల్ గా రియాక్ట్ అయిన అందరికి షాకిచ్చింది. తప్పకుండా ఒప్పుకుంటానని చెప్పిన ఆమె.. పవన్ కు నాలుగో భార్యగా ఉండటానికి నాకు ఇష్టమే అని రిప్లై ఇచ్చింది. ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ముగ్గురు భార్యలన్న ట్యాగ్ తో ఆయన రాజకీయ ప్రత్యర్థులు అదే పనిగా సటైర్లు వేస్తున్న వేళ.. ఇప్పుడీ నాలుగో భార్య మాట ఒక సెలబ్రిటి నోటి నుంచే రావటం ఆశ్చర్యకరంగా మారింది.