ప్రియుడిని క్షణమైనా విడిచి ఉండలేకపోతున్న స్టార్ డాటర్

0

నిను వీడని నీడను నేను! అన్న చందంగానే అతడిని ఆ స్టార్ డాటర్ వెంటాడుతోంది. అతడు లేని క్షణాన్ని అస్సలు ఊహించుకోలేకపోతోంది. అలా ఆ జంట షికార్లు ప్రతిసారీ కెమెరా కంటికి చిక్కడం చర్చనీయాంశమవుతోంది. ఈసారి కూడా అలానే దొరికిపోయింది ఈ జంట. ఇంతకీ ఎవరీ జంట? అంటే.. సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి .. టీమిండియా ఆటగాడు కె.ఎల్.రాహుల్ గురించే ఇదంతా.

ఈ జంట చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ మధ్య అనుబంధాన్ని చాలా కాలం క్రితమే ఓపెనప్ అయ్యారు. ఆ తర్వాత జంట షికార్లు కామన్ అయిపోయింది.

రాబోయే సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెటర్ కెఎల్ రాహుల్…. తన గాళ్ ఫ్రెండ్ అయిన యువకథానాయిక అతియా శెట్టితో కలిసి తప్పిపోయాడట. అది కూడా రాత్రివేళ ఈ జంట తప్పిపోయిందన్న పుకార్ షికార్ చేస్తోంది. ఆసీస్ తో భారత్ మూడు వన్డేలు.. మూడు టి 20లు.. అలాగే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

తాను యునో కార్డులను పట్టుకున్న చిత్రాన్ని పంచుకునేందుకు రాహుల్ ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి.. “మిస్ యునో నైట్స్ “ అంటూ వ్యాఖ్యానించాడు. దానికి సాటి క్రికెటర్లు అంతే చిలిపిగా స్పందించారు.
అతియాతో పాటు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అతని భార్య ఆషితా సూద్.. క్రికెటర్ సినాన్ కదర్ .. రెస్టారెంట్ రితిక్ భాసిన్లను రాహుల్ ట్యాగ్ చేశాడు.

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించాడు. జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేక పోయినప్పటికీ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. 14 ఇన్నింగ్స్ లలో 670 పరుగులు చేశాడు రాహుల్.

అతియా- రాహుల్ కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. వారు నూతన సంవత్సరంలో థాయ్ లాండ్ లో స్నేహితుల బృందంతో కలిసి సెలబ్రేట్ చేయడంతో ఆ ఊహాగానాలను మరింత బలపరిచినట్టయ్యింది. అయితే లింక్-అప్ పుకార్లను ఈ జంట అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ నెల ప్రారంభంలో రాహుల్ ప్రేయసి పుట్టినరోజున ఇన్ స్టా పోస్ట్ తో ఆతియాకు శుభాకాంక్షలు తెలిపారు. అతను ఒక సెల్ఫీని పంచుకున్నాడు. దీనిలో ఆమె తన భుజంపై తల ఆన్చి విశ్రాంతి తీసుకుంటోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ తో అతియాకు ఉన్న సంబంధం గురించి సునీల్ గవాస్కర్ అడిగారు. అయినా రాహుల్ వ్యూహాత్మకంగా ఆ ప్రశ్నను తప్పించుకున్నాడు. నాకు ఏ సంబంధం లేదు. మీరు అథియాను అడగాలి అంటూ స్కిప్ కొట్టేశాడు.

సూరజ్ పంచోలి `హీరో` (2015) చిత్రం ద్వారా అతియా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె చివరిసారిగా నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి దేబామిత్ర బిస్వాల్ `మోటిచూర్ చక్నాచూర్` లో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.