మూడేళ్ల గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3

0

బాలీవుడ్ బాద్ షా.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా గత కొంత కాలంగా ఆశించిన స్తాయిలో సక్సెస్ లను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. షారుఖ్ ఖాన్ చివరగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదల అయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇంత కాలం కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. ఎట్టకేలకు యశ్ రాజ్ బ్యానర్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. దాంతో షారుఖ్ కొత్త సినిమా పఠాన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో షారుఖ్ కమ్ బ్యాక్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

పఠాన్ పట్టాలెక్కకుండానే షారుఖ్ మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను ఈయన చేస్తాడంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. పఠాన్ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. అది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో రాజ్ డీకే దర్శకద్వయంతో కూడా షారుఖ్ పని చేసే అవకాశం కనిపిస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ దర్శకద్వయం నిలిచింది. అందుకే వారితో సినిమాను చేసేందుకు షారుఖ్ సిద్దంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.