Templates by BIGtheme NET
Home >> Cinema News >> Prabhas: ప్రభాస్ కొత్త బిజినెస్.. పెద్ద వ్యాపారమే.. !

Prabhas: ప్రభాస్ కొత్త బిజినెస్.. పెద్ద వ్యాపారమే.. !


టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా మారాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో ప్రభాస్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అటు డార్లింగ్ కూడా రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సంపాదించిన డబ్బుతో పెద్ద వ్యాపారం ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినట్లు తెలుస్తోంది.

డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వ‌రుస ఫ్లాప్‌లు వ‌చ్చిన ప్ర‌భాస్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్‌తో కలిసి ప్రభాస్ సలార్ సినిమా తీస్తున్నాడు. అటు ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ సినిమా షూటింగ్స్ కూడా చేస్తున్నాడు ప్రభాస్. అయితే సినిమాలకు రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం ఇండియాలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటున్న హీరోల‌లో ప్ర‌భాస్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఈయ‌న ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడ‌ని టాక్‌. నిర్మాత‌లు కూడా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు ఈ స్థాయిలో పారితోషికాన్ని ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నార‌ట‌.

2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఇండస్ట్రీకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు 21. అయితే ఇన్నాళ్ల కెరీర్‌లో ప్రభాస్ బాగానే సంపాదించాడు.

అయితే ఇప్పుడు ప్రభాస్ తాను సంపాదించిన కోట్ల రూపాయలతో భారీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ డ‌బ్బుల‌తోనే ప్ర‌భాస్ బిజినెస్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు టాక్‌. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ హోట‌ల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

కేవ‌లం ఇండియాలోనే కాకుండా స్పెయిన్‌, దుబాయి వంటి దేశాల్లో కూడా ప్ర‌భాస్ హోట‌ల్స్‌ను ఓపెన్ చేయ‌బోతున్నాడు. ఇలా ఒకవైపు సినిమాలు.. మ‌రో వైపు బిజినెస్‌ల‌తో రెండు చేతులా సంపాదించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడు. దీనికి సంబంధించి ప్ర‌భాస్ టీం ఇప్ప‌టికే ప‌నులు మొదలు పెట్టిందని సమాచారం.

మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలుగు రుచులను అందించాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడని, ఇందుకు తగ్గట్లుగానే ఇటలీ, స్పెయిన్, దుబాయ్ దేశాల్లో తన హోటల్ బిజినెస్ ను వ్యాప్తి చేయాలనీ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే తాను మొదలు పెడుతున్న వ్యాపారానికి ప్రభాస్ మాత్రమే ఓనర్ గా ఉండాలనుకుంటున్నాడట. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు కొద్దిగా తీరిక ఉన్న బిజినెస్ పనులను చూసుకొంటున్నాడట. ప్ర‌స్తుతానికి క‌మిట్ అయిన సినిమాల‌ను ప్ర‌భాస్‌ ష‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు

ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసకోలేదు. ఇది ఎప్పుడు హాట్ టాపిక్. ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో వ్యాపారాలు అంటూ బిజీగా మారితే అతని ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్లంచేస్తున్నారు.