బాలయ్యా మజాకా డీల్ అదిరింది!

0

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రికార్డు స్థాయి బిజినెస్ ని సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ బిజినెస్ తో పాటు నాన్ థియేట్రిక్ రైట్స్ పరంగానూ రికార్డు సృష్టిస్తున్నాయి. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ `దసరా` ఉభయ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే తరమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ రికార్డు సృష్టించడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్ నుంచి మాంచి రైజింగ్ లోకి వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన `అఖండ` అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని తో చేస్తున్న విషయం తెలిసిందే. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో న్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మలయాళ నటి హానీ రోస్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్ లో కనిపించబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇటీవలే టర్కీ వెళ్లింది.

అక్కడ పలు సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్ ని పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చేశారు. దసరా సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. భారీ అంచనాలు నెలకొన్న మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన డీల్ ని మేకర్స్ ఫినిష్ చేసినట్టుగా తెలిసింది. దాదాపు రూ. 58 కోట్ల తో నాన్ థియేట్రికల్ డీల్ ని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ డీల్ ని పూర్తి చేయడం బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డుగా చెబుతున్నారు. అంతే కాకుండా బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ ఫిలిం ఇదే కావడం విశేషం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.