ట్రీట్మెంట్ కోసం అగ్ర కథానాయిక అమెరికా వెళ్లనుందా..?

0

సౌత్ స్టార్ హీరోయిన్ ఒకరు ఇటీవల కాలంలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ.. ఏడాది పొడవునా బిజీగా ఉండేలా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో చిత్రాన్ని ప్రారంభిస్తూ.. ఒక దాని తర్వాత ఒక సినిమాని పూర్తి చేసుకుంటూ వచ్చింది.

గ్లామరస్ బ్యూటీ ఓవైపు వరుస సినిమాలు సెట్ చేసుకుంటూనే.. మరోవైపు బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ మరియు కమర్షియల్ యాడ్స్ లోనూ హవా చూపించింది. అయితే పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న ఆమె.. సడన్ గా షూటింగ్స్ అన్నీ హోల్డ్ లో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సదరు హీరోయిన్.. విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆమె బ్రాండ్ వాల్యూ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ – ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

అలానే తన హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తూ.. తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తుంది. అయితే ఆమె గత రెండు నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.

ఓపక్క సినిమా షూటింగుల నుంచి బ్రేక్ తీసుకోవడం.. మరోపక్క సోషల్ మీడియాలో యాక్టవిటీ తగ్గించడంతో.. అగ్ర కథానాయిక గురించి నెట్టింట అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం పై అనేక రూమర్స్ వినిపించాయి.

ఆ హీరోయిన్ ఇప్పుడు ఏదో స్కిన్ ప్రాబ్లమ్ తో బాధ పడుతోందని.. ప్రస్తుతం అన్ని పనులు పక్కన పెట్టి చికిత్స తీసుకుంటోందని.. అందుకే సోషల్ మీడియా నుంచి కూడా విరామం తీసుకుందని.. ఇలా రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో తమ ఫేవరేట్ హీరోయిన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నటి ఆరోగ్యంగానే ఉందంటూ ఆమె టీమ్ స్పష్టం చేసింది. అయినప్పటికీ హీరోయిన్ చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు.

ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూఏస్ఏ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో స్కిన్ ట్రీట్మెంట్ కోసం వెళ్తుందని.. ఈ నెలలోనే పయనం అవుతుందని అంటున్నారు. అమెరికా నుంచి ఎప్పుడు తిరిగి వస్తుందనే దానిపై క్లారిటీ లేదని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇదే నిజమైతే స్టార్ హీరోయిన్ నటిస్తున్న సినిమాలన్నీ డిలే అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆల్రెడీ కంప్లీట్ అయిన మూవీ మాత్రం మంచి డేట్ దొరికితే విడుదల చేస్తారు. ఇక ఈ ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేసిన మూవీ కూడా అనుకున్న సమయానికి రాకపోవచ్చు. ఇప్పటికే ఆమె ఈ విషయాన్ని మేకర్స్ కు తెలియజేసినట్లు నివేదికలు ఉన్నాయి. త్వరలోనే అగ్ర నటి అమెరికా ప్రయాణంపై స్పష్టత వస్తుందేమో చూడాలి.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.