Templates by BIGtheme NET
Home >> Cinema News >> Unstoppable 2: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో వచ్చేస్తోంది… ఎప్పటి నుంచే అంటే..!

Unstoppable 2: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో వచ్చేస్తోంది… ఎప్పటి నుంచే అంటే..!


గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి సారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో టాక్ షో మొదలు పెట్టాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును అందుకున్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఆహా లో వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ NBK ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరోవైపు సెకండ్ సీజన్ కూడా మొదలు కానుంది. తొలి సీజన్ చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో ముగిసింది. రెండో సీజన్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని

ఈ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు.

మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సీజన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫ్యామిలీ నుంచి ఆఖరికి మహేష్ బాబు ఎపిసోడ్ వరకు ఆడియెన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చింది. బాలకృష్ణ అందరిలా కాకుండా కాంట్రవర్సీ టాపిక్స్ పై కూడా అనేక రకాల సందేహాలను అడగడం తో మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది.

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ షో’ సెకండ్ సీజన్‌‌కు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. సెకండ్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో, అదిగో అంటున్నారే తప్ప సీజన్ 2కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రావడం లేదు. తాజాగా ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. మేకర్స్ ఈ షోను ఆగస్టు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.

సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని, అలానే ఈ సీజన్ లో తొలి గెస్ట్ గా మెగాస్టార్ రానున్నారని తెలుస్తోంది. కాగా త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ కానున్నాయి.

మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయంపై నిర్వాహకులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తప్పకుండా బాలకృష్ణ మరొక సీజన్ తో అలరించబోతుండటంతో అటు బాలయ్య అభిమానులు.. ఇటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.