బాలయ్య ఫోన్ విసిరేశారు సరే కానీ.. !!

0

నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ లైవ్ వేడుకలో సెల్ ఫోన్ విసిరేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సెహరి పోస్టర్ లాంచ్ ఈవెంట్లో ఈ అనూహ్య సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజనుల్లో వైరల్ గా మారింది. దీనికి నెటిజనుల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య కోపిష్టి అని అందుకే అలా చేశారని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యకు శత్రువు ఎవరో ఫోన్ చేశారు. అందుకే అలా విసిరేసారంటూ ఓ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అది అలా కనిపించడం లేదు. వాస్తవానికి ఆ దృశ్యాన్ని పాజిటివ్ యాంగిల్ లో చూస్తే ఒకలా నెగెటివ్ యాంగిల్ లో చూస్తే ఇంకోలా కనిపిస్తోంది.

ఆయన సీరియస్ గా ఈవెంట్ లో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడేందుకు ప్రిపేరవుతుంటే డిస్ట్రబ్ చేసే కాల్ అది. అందుకే ఆయన ఆ ఫోన్ ని తన సహచరుడి వైపుగా విసిరేశారు. అయితే అది కూడా క్యాచ్ అంటూ విసిరారే తప్ప అనుచిత ప్రవర్తన కానే కాదు. కానీ మీడియాలో హడావుడి మాత్రం ఓ రేంజులోనే ఉంది మరి. నెటిజనుల్లో మీమ్స్ కామెంట్లు కాస్త పెచ్చుమీరడం సరికాదనే అనిపిస్తోంది. “సినిమా అనేది ప్యాషన్.. ప్రేమించండి.. పిచ్చి ఉండకూడద“ని బాలయ్య ఈ వేదికపై క్లాస్ తీస్కున్న తీరుకు కొందరు నెటిజనులు కౌంటర్లు వేయడం చర్చకు వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Punch Siksha (@punchsiksha)