బోయ్ ఫ్రెండ్ కంటే కుక్క విశ్వాసం గలది!

0

మనిషి కంటే కుక్క ఎంతో విశ్వాసమైనది. అందుకే చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు. నిజానికి పెట్స్ తో స్నేహం వల్లనే చాలా మంది అమెరికన్లు ఒత్తిడిని జయిస్తున్నారన్న సర్వే కూడా నిశ్చేష్ఠుల్ని చేస్తుంది. బిజీ లైఫ్ పర్యవసానం.. ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉండడం వల్ల కూడా ఒత్తిడి మనిషిని తినేస్తుంటుంది. దాని నుంచి బయటపడాలంటే ఇదిగో ఇలా శ్రుతిహాసన్ లా కుక్క పిల్లతో స్నేహం చేయాలి.

శ్రుతి లో క్రైసిస్ గురించి చెప్పాల్సిన పనే లేదు. బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోవడం అటుపై డిప్రెషన్ గురించి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు రైట్ వేలో ఫ్రెండ్షిప్ చేస్తోంది అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తోంది యూత్.

ఓవైపు పెట్స్ తో స్నేహం మరోవైపు సినిమాలతో బిజీ లైఫ్ ఇదే శ్రుతి ప్రస్తుత విధి. మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటించిన శ్రుతి తదుపరి పవన్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం సాగుతోంది. అటు తమిళం హిందీలోనూ వరుసగా ప్రాజెక్టులకు కమిటవుతోంది. విజయ్ సేతుపతి సరసనా ఓ చిత్రంలో చేస్తోంది.