కుర్రహీరోయిన్ పై దుష్టశక్తుల కన్ను..?!

0

ఇటీవల యువకథానాయిక సారా అలీఖాన్ పేరు రాంగ్ రీజన్స్ తో మీడియాలో హైలైట్ అయిన సంగతి తెలిసిందే. దివంగత సుశాంత్ సింగ్ తో సారా అలీఖాన్ ప్రేమాయణం హైలైట్ అయ్యింది. అలాగే డ్రగ్స్ పార్టీలతో సారా అలీఖాన్ సంబంధాల పైనా ఆరాలు తీసారు నెటిజనం. ఎన్.సి.బి ముందు హాజరైన సారా తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంది.

అదంతా గతం. ఆ తర్వాత సారా అలీఖాన్ కుటుంబం రకరకాల సెలబ్రేషన్స్ తో సేద దీరుతూ కౌంటర్లు వేయడం చర్చకు వచ్చింది. తాజాగా దీపావళి సందర్భంగా సారా షేర్ చేసిన ఈమోజీలు నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

చెడు కన్ను.. ప్రపంచం.. ప్రార్థన.. ఫ్యామిలీ ఎమోజీలు సారా అలీ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీపావళి తర్వాతా ఇంకా సారా పండుగ మూడ్ లోనే ఉంది. దీపావళి ఫోటోలతో ఆమె ఫీడ్ ను నింపుతోంది. ప్రతి పండుగలో ఆచారం వలె సారా ఆమె సోదరుడు ఇబ్రహీం.. వారి తల్లి గారు అమృత సింగ్… పండుగను జరుపుకున్నారు. ఆ ఫోటోల్ని సారా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. మంగళవారం నాడు ప్రత్యేకించి ఫామ్-జామ్ ఫోటోల సెట్ ను సారా షేర్ చేసింది.

“దీపావళి తో ఖతం హో గాయి.. అబ్ క్యాప్షన్ నహి మిల్ రాహా హై“ అన్న వ్యాఖ్యను జోడించగా దానిపై యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. “సహోదరసహోదరీలందరికీ సంతోషంగా భాయ్ డూజ్ శుభాకాంక్షలు. మిమ్మల్ని మళ్లీ భయపెట్టేందుకు వేచి ఉండలేం“ అంటూ ఇబ్రహీం వ్యాఖ్యను జోడించారు. అందరికీ చాలా ఆనందం.. మంచి ఆరోగ్యం సంపద దక్కాలని ఈ సందర్భంగా సారా కోరుకుంది.

సారా అలీ ఖాన్ తదుపరి కూలీ నంబర్ 1 లో కనిపించనుంది. మేలో థియేటర్లలోకి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనావైరస్ మహమ్మారి కారణంగా క్రిస్మస్ విడుదలకు వాయిదా పడింది. `కూలీ నెం 1` అదే పేరుతో డేవిడ్ ధావన్ 1995 హిట్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన సారా నటించింది. సారా తదుపరి సినిమాల జాబితాలో `అట్రాంగి రే` ఇప్పటికే క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ – ధనుష్ లతో కలిసి నటించింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది.