పెళ్లి వేదిక వద్ద ముందే ప్రత్యక్షమైన మెగా ప్రిన్సెస్

0

టాలీవుడ్ కి 2020 వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో పలువురు హీరోలు ఓ ఇంటివాళ్లయ్యారు. మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ నిహారిక వెడ్డింగ్ కి సమయమాసన్నమైంది. ఇటీవలే నిహారిక-చైతన్య ల నిశ్చితార్థం పూర్తయింది.

ఇక పెళ్లికి బాజా మోగడమే ఆలస్యం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తదుపరి పెద్ద వివాహం మెగా డాటర్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రకరకాల కారణాలతో ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇప్పటికే నిహారిక ఉదయ్ పూర్ వెళ్లారట. అందుకు సంబందించిన ఓ ఫోటో తాజాగా రివీలైంది. ఎంతో సంతోషంగా ఉన్న కొనిదేలవారమ్మాయి తన అందమైన ముఖాన్ని చిరునవ్వుతో ఆవిష్కరించిందిలా.

త్వరలో మెగా కుటుంబంలోని ఇతర సభ్యులు పెళ్లి సన్నాహాలను పర్యవేక్షించడానికి ఉదయపూర్ కు వెళ్లనున్నారట. వివాహానికి ముందు జరిగే అన్ని వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొంటారని తెలిసింది. ఇదే వెన్యూలో వెంకటేష్ కుమార్తె .. రాజమౌళి కొడుకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. నిహారికా – చైతన్య నిశ్చితార్థం ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తదుపరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కిస్తాయనడంలో సందేహం లేదు.