Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘బంగారు బుల్లోడు’ కోసం బాలయ్య సాంగ్ రీమిక్స్..!

‘బంగారు బుల్లోడు’ కోసం బాలయ్య సాంగ్ రీమిక్స్..!


అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఇందులో పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరి పల్లిక దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ని తీసుకున్న అల్లరి నరేష్.. అందులోని చార్ట్ బస్టర్ ‘స్వాతిలో ముత్యమంత’ సాంగ్ ని రీమిక్స్ చేశారు. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

రాజ్ – కోటి సంగీతం సమకూర్చిన ఒరిజినల్ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ రీమిక్స్ చేశారు. దీనికి లిరిసిస్ట్ వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించగా.. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. సింగర్స్ ఎల్వీ రేవంత్ – ప్రియా ఆలపించారు. బాలకృష్ణ – రవీనా టాండన్ ఆడిపాడిన ఈ రెయిన్ సాంగ్ లో అల్లరి నరేష్ – పూజా జవేరి స్టెప్పులేశారు. కలర్ ఫుల్ విజువల్స్ తో ‘స్వాతిలో ముత్యమంత’ పాట ఆకట్టుకుంటోంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రాన్ని ఎమ్.ఆర్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు.