పవన్ తో బండ్ల సినిమా.. ‘నా బాస్ ఓకే అన్నారు.. నా కలలు నిజమయ్యాయి’

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బండ్ల గణేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయనతో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ సినిమాలు నిర్మించాడు. ఈ క్రమంలో మళ్ళీ మీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అంటూ మెగా అభిమానులు అడిగే ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానం ఇచ్చాడు. ఇన్నాళ్లు ‘మన దేవుడి బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను.. బాస్ ఓకే అంటే పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా’ అని చెప్తూ వచ్చిన బండ్ల.. ముచ్చటగా మూడోసారి పవన్ కల్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ “నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు. దీనికి పవన్ కల్యాణ్ తో దిగిన లేటెస్ట్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు బండ్ల గణేష్. కాగా పవన్ కల్యాణ్ – బండ్ల గణేష్ కాంబోలో వచ్చిన ‘తీన్ మార్’ మూవీ ప్లాప్ అవ్వగా.. ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ప్లాప్స్ లో ఉన్న పవన్ కెరీర్లోనే ‘గబ్బర్ సింగ్’ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మిగిలింది. మరి ఇప్పుడు వీరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఏ రేంజ్ సినిమా వస్తుందో చూడాలి. ఇక గత ఐదేళ్లుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్ నిర్మించే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనని చెప్పవచ్చు.