కర్మ అంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్

0

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజన గర్లానీ కన్నీరు మున్నీరు అయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులోని మహిళ సాంత్వన కేంద్రంలో ఈ కేసులో అరెస్ట్ అయిన రాగిణి మరియు సంజనను ఉంచడం జరిగింది. అక్కడ వీరిద్దరు మాట్లాడుకోలేదట. మౌనంగా ఎవరికి వారు అన్నట్లుగా ఉన్నారట. రాత్రి సమయంలో పొద్దు పోయే వరకు సంజన కన్నీరు పెట్టుకుందని ఆమె లేడీ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఇది అంతా నా కర్మ అందట. సంజన భోజనం కూడా వద్దని సంజన ఖాళీ కడుపుతోనే ఉందట.

సంజన ఈ కేసులో కర్మ కొద్ది ఇరుక్కున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిందట. ఈ విషయంలో ఇంకా చాలా మంది పెద్ద వారు ఉన్నా కూడా తననే అరెస్ట్ చేశారనే ఆవేదనలో ఆమె ఉందట. కన్నడ సినిమా పరిశ్రమ మరియు రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. విచారణ అధికారులు నేడు మరియు రేపు కూడా సంజనను ప్రశి్నంచే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎంక్వౌరీలో సంజన ఏం సమాధానం చెప్పబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.