మరో క్లైమాక్స్ రాబోతుంది

0

రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’ అనే టైటిల్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాతో వర్మ బాగానే డబ్బులు మూట కట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శృంగార సినిమాగా ఆ సినిమాను వర్మ తీశాడు. ఇప్పుడు అదే టైటిల్ తో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో శ్రీరెడ్డితో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు నటించిన సినిమా ‘క్లైమాక్స్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యగా కనిపించబోతున్నాడు. విజయ్ మాల్య ఇండియా తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరితే ఎలా ఉంటుంది పరిస్థతి అనే విషయాలను చూపించేందుకు క్లైమాక్స్ అనే సినిమాను తీశారట. శ్రీ రెడ్డి తన రియల్ లైఫ్ పాత్రను సినిమాలో పోషించిందట. అంటే ప్రముఖులను విమర్శిస్తూ మరో వైపు సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక శివ శంకర్ మాస్టర్ సినిమా లో మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొత్తానికి క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తుంది. కాస్త వివాదాస్పద అంశాలు ఉన్నా కూడా తప్పకుండా సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని అంతా నమ్ముతున్నారు.