బిబి4 : రెండవ స్థానంపైనే అందరి దృష్టి

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో మూడు నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. సీజన్ 2 విజేత ఎవరు అనే విషయం అయిదు ఆరవ వారంలోనే తేలిపోయింది. కౌశల్ ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంతా బలంగా నమ్మారు. అనుకున్నట్లుగానే సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. సీజన్ 3 విజేత విషయంలో కాస్త కన్ఫ్యూజ్ నెలకొన్నా కూడా సీజన్ 4 విషయంలో మాత్రం అభిజిత్ అంటూ చాలా బలంగా సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. ఫిజికల్ గా అంతగా బలంగా లేకున్నా కూడా మైండ్ గేమ్ అతడి ప్రత్యేకత. ఏ టాస్క్ అయినా కూడా అతడు మైండ్ తో ఆడేందుకు ప్రయత్నిస్తాడు.

అభిజిత్ కు మొదటి నుండే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగుంది. నెట్టింట భారీగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో అతడు ఎన్ని సార్లు నామినేట్ అయినా కూడా సేవ్ అవుతూ వచ్చాడు. గంగవ్వ వెళ్లిపోయిన తర్వాత అభిజిత్ కు అత్యధిక ఓట్లు పడ్డాయి అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. కనుక బిగ్ బాస్ ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు సోషల్ మీడియా జనాలు కూడా అభిజిత్ విన్నర్ అవుతాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

విజేత విషయంలో చాలా స్పష్టత కనిపిస్తుంది. అయితే నెం.2 స్థానంలో నిలుస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అఖిల్ మొన్నటి వరకు బలమైన కంటెస్టెంట్ గా ఉన్నా కూడా ఇప్పుడు సోహెల్ ఆ స్థానంలో నిలిచే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. సోహెల్ తీరుకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. కొందరు అయితే సోహెల్ బలంగా విజేత అవుతాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప వీరిద్దరు కాకుండా మరొకరు టాప్ 2 లో నిలవడం కాని విజేత అవ్వడం కాని జరగదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.