గుర్రమెక్కిన బ్యాచిలర్ మగధీరుడు

0

హార్స్ రైడింగ్ లో నవతరం హీరోలంతా ఆరితేరిన ఘనాపాటీలే. మహేష్- ప్రభాస్ -రామ్ చరణ్ – ఎన్టీఆర్ – బన్ని .. వీళ్లంతా గుర్రపుస్వారీ చేసినవారే. ఆన్ లొకేషన్ .. ఆఫ్ ద లొకేషన్ గుర్రపుస్వారీ ని అమితంగా ఇష్టపడతారు మన స్టార్లంతా.

ముఖ్యంగా మగధీర సమయంలో రామ్ చరణ్ గుర్రపుస్వారీ విన్యాసాలపై ఆసక్తికర చర్చ సాగింది. బాస్ మెగాస్టార్ తనయుడు చరణ్ గుర్రపు స్వారీపై ఒక రేంజులో కితాబిచ్చారు. అదంతా సరే కానీ.. ఇక్కడ అక్కినేని అఖిల్ కూడా అలానే స్వారీ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఒక తటాకం పరిసరాల్లో గుర్రంపై స్వారీ చేస్తున్న అఖిల్ ఆచేతనంగా చూస్తూ ఉన్నాడు. ఇలా గుర్రంపై స్వారీ చేయడం తనకు ఎంతో రిలీఫ్ నిస్తుందని ఈ సందర్భంగా అన్నాడు.

గుర్రపుస్వారీ కి సంబంధించిన ఫోటోని షేర్ చేసిన అఖిల్ దానికి ఆసక్తికర వ్యాఖ్యను ఇన్ స్టాలో రాశారు. “ఆదివారం నా ప్రియమైన # గిజెల్ తో కలిసి షికార్ కొచ్చాను. తను నన్ను కాలి అంచు (టో) మీద ఉంచుతుంది. అదే సమయంలో సడలిస్తుంది. ఇది నాకు ఎంతో గొప్ప చికిత్సా విధానమో నేను చెప్పలేను. తాజా రిలీఫ్ తో ఈ వారం అంతా సరిపడేంత శక్తిని నాకు ఇస్తుంది. చురుకైన ఆదివారాలకు చీర్స్!“ అంటూ వ్యాఖ్యను జోడించారు అఖిల్. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కి రానుంది.