నాయకురాలి పిట్ట కథలు వెనక..!

0

గ్యాప్ వచ్చినా వెబ్ సిరీస్ తో లైమ్ లైట్ లోకొస్తున్నారు లక్ష్మీ మంచు. చాలా గ్యాప్ తరువాత లక్ష్మి మంచు `పిట్ట కథలు` అనే నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. లక్ష్మీ మంచు ఇందులో రాజకీయ నాయకురాలిగా నటించారు.

ఈ పాత్ర నిజంగా కష్టమైనది. నాకు అస్సలు సంబంధం లేనిది. కానీ సామర్థ్యం నాలో ఉంటే.. నేనే దాన్ని బయటకు తీసుకురావాలి. నేను వెంటనే కలిసిపోయి చేయగలిగే కొద్ది మంది సహకారం ప్లస్ అయ్యింది. నాయకురాలి పాత్రలో నన్ను చూసే నా స్నేహితులు.. కనీసం ఒకటి లేదా రెండు సందర్భాల్లోనైనా వెంటనే ఐడెంటిఫై చేస్తారని ప్రశంసిస్తారని.. నేను అనుకుంటున్నాను“ అని లక్ష్మీ మంచు తెలిపారు.

నాగ్ అశ్విన్- బి.వి.నందిని రెడ్డి- తరుణ్ భాస్కర్- సంకల్ప్ రెడ్డి ఈ చిత్రంలోని నాలుగు భాగాలకు దర్శకత్వం వహించారు. పిట్ట కథలు లోని నాలుగు కథలు నిర్దిష్ట భావాలు ఉన్న నలుగురు మహిళల గురించి ఆవిష్కరిస్తుంది. శ్రుతిహాసన్- మంచు లక్ష్మి- అమలాపాల్ – ఈషా రెబ్బా ఆ నాలుగు పాత్రల్లో నటించారు. అషిమా నర్వాల్- జగపతిబాబు- సత్యదేవ్- సాన్వే మేఘన- సంజిత్ హెగ్డే ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆర్.ఎస్.వీ.పీ మూవీస్- ఫ్లయింగ్ యూనీకార్న్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ల పై రోనీ స్క్రూవాలా- ఆశి దువాసారా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తుంది.