మళ్లీ మెగా కాంపౌండ్లోకి వెళ్తున్న రాశీ..?

0

‘రాశీఖన్నా..’ ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ కుర్రకారు గుండెల్లో కొత్త ఆశలు రేకెత్తించిందీ ఢిల్లీ బ్యూటీ. ఈ అమ్మడు టాలీవుడ్లోకి అడుగు పెట్టి దాదాపు ఆరేళ్ల పైనే అయ్యింది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా.. కుర్ర హీరోలతో తనదైన పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. చాలా కాలంగా టాలీవుడ్ లో ఉన్నప్పటికీ.. ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత మరో సినిమాకు సంతంకం చేయలేదు రాశీ. అయితే.. టాలీవుడ్లో అవకాశాలు పెద్దగా లేకున్నా తమిళంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో కోలీవుడ్లో చక్రం తిప్పుతోందీ భామ.

అయితే.. తాజాగా టాలీవుడ్లో ఈ భామకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాలో సందడి చేసిన రాశీ.. మరోసారి మెగా కాంపౌండ్లోకి అడుగు పెట్టిందని సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు దర్శకుడు. సరికొత్త జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

కాగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రాశీ ఖన్నా కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి సుప్రీం కాగా.. మరొకటి ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్న ఈ జంట.. హ్యాట్రిక్ పై కన్నేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.