ఐశ్వర్యరాయ్ కు ఐవీఎఫ్ లో పుట్టాడట.. షాకిచ్చిన వైజాగ్ కుర్రోడు?

0

తాజాగా ఓ సంచలన ఆరోపణ కలకలం రేపుతోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికీ తన అందచందంతో ప్రపంచ సుందరి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన ఐశ్వర్య రాయ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.వీరికి ఒక కూతురు కూడా ఉంది.

అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పై ఒక వ్యక్తి సంచలన ఆరోపణ చేశాడు. ఓ 32 ఏళ్ల యువకుడు చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. తాను ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ 32 ఏళ్ల సంగీత్ కుమార్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. అంతేకాదు తేది టైం కూడా చెప్తున్నాడు.

ఐశ్వర్యరాయ్ కు 15 ఏళ్లు ఉన్నప్పుడు తాను పుట్టానని.. ఓ రెండేళ్ల పాటు ఐష్ తల్లిదండ్రుల వద్దే ఉన్నానని.. ఆ తర్వాత తనను తండ్రి లండన్ నుంచి వైజాగ్ కు తీసుకువచ్చాడని చెబుతున్నాడు. దీనికి సంబంధించి తన దగ్గర మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. తన బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ చించేశారని ఆరోపిస్తున్నాడు.

అయితే ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ ఆరోపిస్తున్న సంగీత్ కుమార్ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి మానసిక స్థితి బాగోలేదని చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

ఇక ఐశ్వర్యరాయ్ ఇలాంటి వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించలేదు.