అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ టీజర్…!

0

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ”బెల్ బాటమ్”. 1980లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ స్కాట్లాండ్ లో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే ముందుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా ‘బెల్ బాటమ్’ నిలిచింది. 40 రోజుల ఫారిన్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బెల్ బాటమ్’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా టీజర్ లో అక్షయ్ కుమార్ విమానాల మధ్య స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు చూపించారు. అలానే అక్షయ్ కంటైనర్ ని పట్టుకొని వేలాడుతున్నట్లు చూపించి ఈ చిత్రంలో యాక్షన్ కు ఓ రేంజ్ లో ఉండబోతోందని హింట్ ఇచ్చారు. ఇక అక్షయ్ ‘రా’ ఏజెంట్ పాత్రను పోషిస్తున్నట్లు అర్థం అవుతోంది. అక్షయ్ కుమార్ విభిన్న మీసాలతో కొత్తగా కనిపించడంతో పాటు 80వ దశకానికి తగ్గట్లు బెల్ బాటమ్ ప్యాంటు ధరించి ఉన్నాడు.

ఈ చిత్రంలో వాణీ కపూర్ – హ్యూమా ఖురేషి – లారాదత్తా హీరోయిన్లుగా నటించారు. రంజిత్ ఎం.తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా ఎంటర్టైన్మెంట్ మరియు ఎమ్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో వషూ భగ్నానీ – జాకీ భగ్నానీ – దీప్షికా దేశ్ముఖ్ – మోనీషా అద్వానీ – మధు భోజ్వానీ – నిఖిల్ అద్వానీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బెల్ బాటమ్’ మూవీని 2021 ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.