బిగ్ బాస్ సామ్రాట్ పెళ్లి

0

టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో పలువురు సెలబ్రటీలు పెళ్లి పీఠలు ఎక్కారు. రానా.. నితిన్.. నిఖిల్ లతో పాటు కొందరు టెక్నీషియన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి పీఠలు ఎక్కాడు. నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన సామ్రాట్ ఆమద్య వివాదంలో చిక్కుకున్నా దాని నుండి బయట పడ్డాడు. ఇప్పుడు మళ్లీ కొత్త జీవితంను ప్రారంభించేందుకు గాను పెళ్లి చేసుకున్నాడు.

కరోనా మరియు ఇతరత్ర కారణాల వల్ల సామ్రాట్ పెళ్లి నిరాడంబరంగా అతి తక్కువ మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. సామ్రట్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన సామ్రాట్ మళ్లీ నటుడిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బిగ్ బాస్ లో బలమైన కంటెస్టెంట్ గా నిలిచిన సామ్రాట్ అభిమానుల అభిమానంను దక్కించుకున్నాడు.