ప్రభాస్ కు బై చెప్పి వచ్చేసిన పూజా

0

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా గత నెల రోజులుగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇటలీ నుండి పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను కూడా విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు ప్రభాస్ తో కలిసి ఇటలీలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్డే నిన్న హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియ ద్వారా షేర్ చేసింది. రాధేశ్యామ్ ఇటలీ తన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న పూజా హెగ్డే హైదరాబాద్ లో మరో షూటింగ్ లో పాల్గొనబోతుంది.

పూజా హెగ్డే వచ్చిన తర్వాత కూడా ప్రభాస్ తో పాటు మరికొందరు నటీనటులపై రాధాకృష్ణ ఇటలీలోనే చిత్రీకరణ జరుపుతున్నాడు. అతి త్వరలోనే ప్రభాస్ మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా ఇండియాకు రాబోతున్నారు. దాంతో విదేశీ షెడ్యూల్ అంతా పూర్తి అవ్వబోతుంది. మరి కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ లో ప్రభాస్ మరియు పూజా హెగ్డేలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. ఆ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొని హైదరాబాద్ లో కలుద్దాం అంటూ ప్రభాస్ కు బై చెప్పింది. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా బ్యాలన్స్ వర్క్ లో పూజా పాల్గొనే అవకాశం ఉందట.