ఎట్టకేలకు షూటింగ్ లో జాయినయిన కత్రిన

0

కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తన సోదరి ఇసాబెల్లా కైఫ్ తో కలిసి గత కొన్ని నెలలుగా ఇంట్లో గడిపారు. అన్ లాక్ దశ తర్వాత చాలా మంది స్టార్లు తిరిగి ఆన్ లొకేషన్ పనిని ప్రారంభించగా.. కత్రిన ఇంకా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు ఇప్పటికి విరామాన్ని వీడి ఈ రోజు తన బృందంతో తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అందుకు రుజువుగా తన ఫోటోను పంచుకుంది. లాక్ డౌన్ లో కత్రిన తన సోదరితో ఫోటోలు వీడియోలను పంచుకునేది.

ఇప్పుడు వర్క్ ప్లేస్ నుంచి ఒక అందమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలో.. కత్రిన పసుపు రంగు దుస్తులు ధరించి ఇంటి మెట్లపై హాయిగా కూర్చుని కనిపించింది. సింపుల్ గా అందమైన చిరునవ్వుతో మంత్రముగ్దులను చేసింది. దానితో పాటు తన టీమ్ ను వ్యక్తిగతంగా కలవడం ఎంత ఆనందంగా ఉందో ఫీలింగ్ ని షేర్ చేసుకుంది. అయితే ఎంతో విచారకరమైన ఎమోటికాన్ తో జూమ్ కాల్ సెషన్ ను కోల్పోయానని అంది.

“ప్రతిరోజూ నా బృందంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది …. (జూమ్ లాగా అందరినీ వ్యక్తిగతంగా కలిపిన బంధం) అంటూ కత్రినా ఫోటోకు వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటోను పంచుకున్న వెంటనే అభిమానులు ప్రశంసా పూర్వక వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. జీరో.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి డిజాస్టర్ల కు భిన్నంగా కత్రిన సల్మాన్ సరసన నటించిన టైగర్ జిందా హై పెద్ద సక్సెసైంది. కానీ ఆ తర్వాత భారత్ చిత్రం ఫెయిలైంది. ప్రస్తుతం కత్రిన సూపర్ గాళ్ తరహా పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కత్రిన తదుపరి ఇషాన్ ఖత్తర్.. సిద్ధాంత్ చతుర్వేది వంటి నవతరం హీరోలతో కలిసి `ఫోన్ బూత్` అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.