బిబి4 : ఆ ముగ్గురిలో మూడింది ఎవరికి?

0

బిగ్ బాస్ చూస్తుండగానే మొదటి వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కు రెడీ అయ్యింది. రేపు చిత్రీకరించబోతున్న ఎపిసోడ్ లో నాగార్జున మొదటగా ఎలిమినేట్ అవ్వబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నాడు. శనివారం లేదా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయిన వారిని ప్రకటిస్తారు. అయితే గత సీజన్ లో మాత్రం శని మరియు ఆదివారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ను శనివారం ఉదయం నుండి రాత్రి వరకు కంటిన్యూస్ గా చిత్రీకరించారు. కనుక ఈసీజన్ లో కూడా రేపే రెండు ఎపిసోడ్స్ కు సంబంధించి చిత్రీకరణ ఉండవచ్చు. కనుక రేపే ఎలిమినేషన్ అయ్యింది ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈవారంలో మొత్తం 7 జంటల నుండి ఒక్కొక్కరు చొప్పున ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఏడుగురిలో గంగవ్వ నూటికి నూరు శాతం సేవ్ అయినట్లే అనడంలో సందేహం లేదు. ఆమె కాకుండా ఇంకా అభిజిత్.. దివి.. మెహబూబ్.. సుజాత.. సూర్యకిరణ్.. అఖిల్ లు ఉన్నారు. వీరిలో దివి మరియు అభిజిత్ లు ఈజీగానే సేవ్ అవుతారు. వీరికి భారీగానే ఓటింగ్స్ పడుతున్నాయట. ఇక సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో మెహబూబ్ కు కూడా ఓట్లు పడుతున్నాయని అంటున్నారు.

మిగిలి ఉన్న ముగ్గురు సూర్య కిరణ్.. అఖిల్.. సుజాతల్లో ఒక్కరు మాత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ముగ్గురిలో సోషల్ మీడియా అంచనా ప్రకారం సూర్య కిరణ్ కు ఎక్కువ మంది వ్యతిరేకంగా ఉన్నారు. కనుక ఆయన ఎలిమినేట్ అవ్వచ్చు అంటున్నారు. ఇదే సమయంలో అఖిల్ మరియు సుజాతలకు పెద్దగా ఓట్లు రావడం లేదని వారిలో కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు లీక్ అవ్వడం ఖాయం అంటున్నారు.