బిబి4 : స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?

0

తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ప్రసారం అయిన మూడు సీజన్ లను చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ముగ్గురు ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కనుక ఈ సీజన్ లో కూడా ఖచ్చితంగా ఒక లేడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి వారంలో లేదా రెండవ వారంలో జబర్దస్త్ ముక్కు అవినాష్ మరియు ఈరోజుల్లో ఫేం సాయి కుమార్ లను వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇప్పించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కూడా క్వారెంటైన్ లో ఉన్నారని సమాచారం అందుతోంది. వారిద్దరు మాత్రమే కాకుండా ప్రతి సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఒక హీరోయిన్ ను వైల్డ్ కార్డ్ తో పంపించబోతున్నారు.

ఆమె ఎవరు అనే విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులు పరిచయం అయిన ముద్దుగుమ్మ అయ్యి ఉండాలి.. అలాగే అందాల ప్రదర్శణ విషయంలో వెనకాడకుండా ఉండాలి. అలాంటి అమ్మాయి కోసం చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు వారాల తర్వాత ఆమెను షో లోకి పంపించే అవకాశం ఉంది. కనుక ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రేకప్.. జంప్ జిలానీ సినిమాలతో పరిచయం అయిన స్వాతి దీక్షిత్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఆ చర్చలు ఫలిస్తే మరికొన్ని రోజుల్లో ఆమె క్వారెంటైన్ కు వెళ్లి అక్కడ నుండి షో లో జంప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ప్రయోగాత్మకంగా వ్యవహరించారు. కనుక వైల్డ్ కార్డ్ లేడీ గా స్వాతినే కాకుండా మరెవ్వరినైనా ప్రేక్షకులు షాక్ అయ్యే లేడీని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.