శ్రుతి `ఏదో తెలీని గజిబిజి జీవితం`

0

ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ సిట్యుయేషన్ & మెంటల్ పొజిషన్ అంటూ ఇంతకుముందే క్లాస్ తీసుకుంది శ్రుతిహాసన్. అవును మరి.. తన మానసిక స్థితిని ఎప్పటికప్పుడు అద్దంపడుతూ ఇదిగో ఇలా దొరికిపోతోంది. నిజానికి శ్రుతి షేర్ చేసిన తాజా ఫోటో చూస్తుంటే `ఏదో తెలీని గజిబిజి జీవితం` కనిపించడం లేదూ?

ఇంకా ఏదో కన్ఫ్యూజన్ అలానే మైండ్ ని తొలిచేస్తున్నట్టుగా.. ఇంకా ఆ పాత ఒత్తిడిని జయించలేకపోయినట్టుగా కనిపిస్తోంది. మైఖేల్ కోర్సలేతో విడిపోయినా ఇంకా ఆ ప్రభావం తనని వీడనట్టే కనిపిస్తోంది. అందుకే ఇటీవల శ్రుతి ఏం చేస్తున్నా అందులో ఏదో ఫ్రస్టేషనే కనిపిస్తోంది తప్ప రిలాక్సేషన్ కనిపించడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఓవైపు జిమ్ యోగా చేస్తూ ధ్యానంలోకి వెళుతూ ఇంత చేస్తున్నా ఇంకా ఏదో మిస్సవుతోంది తనలో.

ఇంతకుముందు కిక్ బాక్సింగ్ చేస్తున్న ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేసింది. టైట్ ప్యూమా స్పోర్ట్ ట్రాక్ తొడుక్కుని ఆరడుగుల బుల్లెట్టులా అంతెత్తు లేపి గట్టిగా అరుస్తూ కాళ్లతో పంచ్ లు విసురుతోంది. తాజాగా తీక్షణంగా చూస్తున్న ఆ లుక్ దానికి కాంబినేషన్ లైటింగ్ .. అంతా చూస్తుంటే స్పాయిల్ లాగే కనిపిస్తోంది. అన్నట్టు తాను ధరించిన ఆ డిజైనర్ టీషర్టు కూడా స్పాయిల్ కంపెనీదే. మొత్తానికి అమెరికన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీలా శ్రుతి ఏదో తెలీని గజిబిజిలో ఉన్నట్టే ఉంది మరి. ఇక తాను నటించిన క్రాక్ ఓటీటీలోకి వస్తుందా రాదా? అన్నది మాత్రం తాను చెప్పదు.