హైదరాబాద్ లో `కందిరీగ` అక్ష

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన `కందిరీగ` చిత్రంలో నటించింది అక్ష. అప్పట్లో ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం తో వరుసగా నాలుగైదు ఆఫర్లు అందుకుంది. నాలుగైదేళ్ల పాటు కెరీర్ ని సవ్యంగానే సాగించింది. కానీ కాలక్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి.

కొంత గ్యాప్ తర్వాత తిరిగి ఈ అమ్మడు లాక్ డౌన్ పీరియడ్ ని ఉపయోగించుకుని రీబూట్ అవుతోంది. మరోసారి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోందట. అక్ష ప్రధాన పాత్రలో జయ సింహ సరసన `అఖిల` అనే లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆ కామార్స్ ప్రాంగణంలో అక్ష అండ్ టీమ్ ప్రత్యక్షమవ్వడం ఆసక్తికరం.

చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్ అక్ష మాట్లాడుతూ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ ఉన్న చిత్రమిదని తనకు పాత్ర బాగా నచ్చిందని తెలిపింది. మోహన్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా. శెట్టి చిరంజీవి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కోసమే హైదరాబాద్ లో దిగింద అక్ష. శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పటి ఫోటోల్ని ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. తిరిగి కెరీర్ ని బెస్ట్ గా మలుచుకుంటుందేమో చూడాలి.