బిబి4 : డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ బెడిసి కొట్టింది

0

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారం ఎపిసోడ్ లో కరాటే కళ్యాణిని ఎలిమినేట్ చేసిన నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో హారిక ఎలిమినేషన్ ను రక్తి కట్టించడంలో విఫలం అయ్యాడు. ఒక్కరు ఒక్కరిగా సేవ్ చేస్తూ వచ్చి చివరకు మోనాల్ మరియు హారికలు మిగిలి ఉండగా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు అంటూ నాగ్ ప్రకటించాడు. ఆ సమయంలో వీరిద్దరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ తో కాకుండా ఎవరు అయితే ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వలేదో వారి వల్ల వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆయన ప్రకటనతోనే ఇదేదో బిస్కెట్ ఎలిమినేషన్ అంటూ అర్థం అయ్యింది. ఇద్దరు కూడా బలమైన కంటెస్టెంట్స్.. ఇద్దరికి మంచి ఓట్లు పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు అని ఇదేదో డ్రామా అంటూ ప్రేక్షకులు ముందుగానే ఊహించారు.

హారిక ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించడం ఆమె వెళ్లి పోయేందుకు సిద్దం అవ్వడం అంతా కూడా జరుగుతున్నా కూడా ప్రేక్షకుల మాత్రం ఆమె ఎలిమినేషన్ ఫేక్ అయ్యి ఉంటుందని ఆమె బయటకు వచ్చినా ఒకటి రెండు రోజుల్లో మళ్లీ లోనికి వెళ్తుంది అంటూ అంతా అనుకున్నారు. అంతా అనుకున్నదే అయ్యింది. దేత్తడి హారిక ఎలిమినేట్ అవ్వలేదు. ఆమెను ఎలిమినేట్ చేయలేదు అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. మరెప్పుడు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతోనే ఇలా అందరిని టెన్షన్ పెట్టినట్లుగా నాగ్ ప్రకటించాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో అంతకు ముందు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి మాట్లాడారు. ఆ సందర్బంగా బిగ్ బాంబ్ ను దేవి పై ఆమె వేసింది. దాంతో ఈ వారంలో ఆమె డైరెక్ట్ గా నామినేషన్ లో ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో సరదాగా బోన్ గేమ్ ఆడించారు. వీకెండ్ లో నాగ్ ఇచ్చిన వార్నింగ్ తో సేఫ్ గేమ్ అస్సలు ఉండక పోవచ్చు అనిపిస్తుంది. మరింతగా ఈ సీజన్ రసవత్తరంగా మారుతుందా అనేది ఈ వారంతో తేలిపోతుంది.