రెండు జంటల ఇల్లీగల్ ఎఫైర్ కు ‘ఎక్స్ పైరీ డేట్’

0

ఈ మద్య కాలం లో ఓటీటీ కంటెంట్ కు ఇండియా లో మంచి డిమాండ్ పెరింగి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ విషయంలో పోటీ పడుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ప్రముఖ స్టార్స్ తో వెబ్ సిరీస్ లను తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్ ల విషయం లో జీ5 సంస్థ ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో ఈమద్య పలు పెద్ద సినిమాలను కొనుగోలు చేసిన జీ5 సంస్థ తాజాగా ‘ఎక్స్ పైరీ డేట్’ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల 2 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వెబ్ సిరీస్ అంటే ఈమద్య కాలంలో మినిమం అడల్ట్ కంటెంట్ కామన్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో కూడా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అడల్ట్ కంటెంట్ చాలానే ఉన్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది. ఇల్లీగల్ ఎఫర్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ సాగుతుందట. రెండు జంటల మద్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టిన చిచ్చును ఈ వెబ్ సిరీస్ లో కథనంగా చూపించారని తెలుస్తోంది. పది ఎపిసోడ్స్ గా సాగే ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఫేమ్ స్నేహా ఉల్లాల్ మరియు తెలుగమ్మాయి మధు శాలిని ఇంకా అలీ రెజా మరియు టోనీలుకేలు నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ప్రోమో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జీ5 లో అక్టోబర్ 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.