ఆ డాన్సర్ పై మనసు పారేసుకున్న శ్రీముఖి.. పెళ్లికి రెడీ అంది

0

బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. పటాస్ తో పాటు ఎన్నో షో లను చేసిన శ్రీముఖి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ లో కూడా సందడి చేసింది. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో.. టీవీల్లో పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంది. తాజాగా సుమ క్యాష్ కార్యక్రమంలో సందడి చేసింది. ఈ వారంలో ప్రసారం కాబోతున్న క్యాష్ లో శ్రీముఖితో పాటు గెటప్ శ్రీను.. ఢీ పండు.. విష్ణు ప్రియలు పాల్గొన్నారు. వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదని తాజాగా విడుదలైన ప్రోమోతో తేలిపోయింది.

ముఖ్యంగా ఢీ పండు అంటే తనకు చాలా ఇష్టం అంటూ శ్రీముఖి చెప్పడం షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లేడీ గెటప్ వేయకుండా ఉంటే ఖచ్చితంగా నేను పండును పెళ్లి చేసుకునే దాన్ని అంటూ సుమ ముందు అందరు అవాక్కయ్యేలా వ్యాఖ్యలు చేసింది. షో మొత్తం శ్రీముఖి.. పండు పెళ్లి థీమ్ తో సాగింది. లేడీ గెటప్ లో నక్కిలీసు గొలుసు పాటతో పండు రచ్చ చేశాడు. అప్పటి నుండి అతడు అంటే అందరికి ప్రత్యేకమైన అభిమానం కలిగింది.

సోషల్ మీడియాలో కూడా పండుకు విపరీతమైన ఫాలోయింగ్ దక్కింది. అందువల్లో లేక నిజంగానే పండు అంటే ఇష్టమో.. లేదా క్యాష్ షో లో హైలైట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఫన్నీగా పండును పెళ్లి చేసుకుంటా అంటూ శ్రీముఖి వ్యాఖ్యలు చేసింది. స్వతహాగానే ఆకట్టుకునే విధంగా ఉండే క్యాష్ షో శ్రీముఖి పండు ఇష్యూతో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగినట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక పండు సిగ్నెచర్ స్టెప్ ను అందరు వేసి హడావుడి చేశారు.