బిబి4 : ఈసారి అభిజిత్ వర్సెస్ అవినాష్

0

బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు.

నేడు కూడా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ప్రసారం కాబోతుంది. నేటి ఎపిసోడ్ పూర్తి అయిన తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఎలిమినేషన్ నామినేషన్ పక్రియలో భాగంగా ఒకొక్కరు ఇద్దరిపై ఒక్కో కోడిగుడ్డు పగులకొట్టాల్సి ఉంటుంది. కెప్టెన్ అయిన అరియానాపై ఎవరు కూడా గుడ్డు పగులకొట్టే వీలు లేదని బిగ్ బాస్ ప్రకటించాడు.

నామినేషన్ పక్రియ అరియానాతో ప్రారంభం అయ్యింది. మొదటి గుడ్డును హారికపై పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఆ తర్వాత తన కెప్టెన్సీ బాధ్యతలను సరిగా నిర్వహించనివ్వడం లేదు.. తాను చెప్పింది సరిగా చేయడం లేదు అంటూ సోహెల్ ను నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పి గుడ్డు అతడిపై పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఈ సమయంలో సోహెల్ అరియానా మద్య గొడవ జరిగింది.

అరియానా తర్వాత అవినాష్ ను నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. మొదట అభిజిత్ తలపై గుడ్డు పగులకొట్టి ఆ తర్వాత హారిక తలపై గుడ్డు పగుల కొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పాడు. తనది చిల్లర కామెడీ అంటున్న సమయంలో వివరణ ఇచ్చుకోకుండా అభిజిత్ చేశాడు అంటూ అవినాష్ అసహనం వ్యక్తం చేశాడు.

సోహెల్ వంతు వచ్చిన సమయంలో నాకు అరియానాపై కొట్టాలని ఉన్నా కెప్టెన్ అవ్వడం వల్ల ఈ వారం వీలు పడటం లేదు వచ్చే వారం చూసుకుందాం అంటూ వెళ్లి మోనాల్ మరియు అభిజిత్ లపై గుడ్డు పగులకొట్టి నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అభిజిత్ తన వంతు వచ్చిన సమయంలో మొదటగా అవినాష్ ను నామినేట్ చేస్తున్నట్లుగా గుడ్డు పగులకొట్టాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటల తూటాలు పేళాయి.

కామెడీ చేసేందుకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. నేను కామెడీ చేస్తాను అన్నాడు. నువ్వు ఎలాగూ చేయవు కనీసం నన్ను కూడా చేయవద్దంటే ఎలా అంటూ అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. నా కామెడీని నాగార్జున గారే మెచ్చుకున్నారు అంటూ అవినాష్ చెప్పాడు. ఇక నేటి ఎపిసోడ్ లో మరింత రచ్చ ఎలిమినేషన్ నామినేషన్ సందర్బంగా జరుగబోతుంది. ప్రోమోలో అమ్మ రాజశేఖర్ చాలా సీరియస్ అయినట్లుగా చూపిస్తున్నారు. నేడు మిగిలిన వారు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి.