భర్తలు అంతా భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్

0

బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం స్టార్ హాట్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ బిపాస బస్సు ప్రస్తుతం వైవాహిక జీవితంలో పడిపోయింది. ఈ సమయంలో కూడా ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంది. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాస బస్సుతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. భర్తతో నటించడం అనేది తనకు చాలా ఇష్టమైన విషయం అంది. ఆయనతో కలిసి నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది.

ముఖ్యంగా భార్య భర్తలు కలిసి నటిస్తే రొమాంటిక్ సీన్స్ మరియు లవ్ సీన్స్ విషయంలో చాలా సౌలభ్యం ఉంటుందని బిపాస ఒక టాక్ షోలో చెప్పుకొచ్చింది. భర్తలతో కలిసి ఏదైనా సినిమా చేస్తే అప్పుడు నటించాల్సిన అవసరం లేదు. సహజంగా చేసినా కూడా బాగుంటుందని బిపాస పేర్కొంది. ఇక భార్య భర్తల మద్య ప్రేమ ఎక్కువ కాలం ఉండాలి అంటే ఏం చేయాలంటూ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రాత్రి పడుకునే సమయంలో భార్య కాళ్లను కనీసం 30 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల భార్యకు భర్తపై మనసులో అంతులేని ప్రేమ పెరుగుతుంది. దాన్ని అంతా కూడా తన హృదయంలో దాచుకుని భర్తల పట్ల ప్రేమగా భార్యలు ఉంటారని చెప్పుకొచ్చింది. కరణ్ ప్రతి రోజు అలా చేస్తాడని నేను అతడి విషయంలో చాలా అదృష్టవంతురాలిని అంటూ చెప్పుకొచ్చింది. కరణ్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మురిసి పోయింది. ఈమె చెప్పిన టిప్ ను మగాళ్లు ఎవరైనా పాటిస్తారా అంటే అనుమానమే అనిపిస్తుంది.