మరో పెళ్లి గురించి హింట్ ఇస్తున్న మాజీ హీరోయిన్

0

బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ పూజా బేడీ దాదాపు 16 సంవత్సరాల క్రితం భర్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలా నుండి విడిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఇద్దరు పిల్లలు ఆలియా ఒమర్. ప్రస్తుతం వీరిద్దరు కూడా పూజా బేడీతో ఉంటున్నారు. ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఫర్హాన్ మరో పెళ్లి చేసుకున్నాడు. లైలా ఖాన్ ను పెళ్లి చేసుకున్న ఫర్హాన్ మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. తండ్రి జీవితం మాదిరిగా తల్లి పూజా బేడీ జీవితం కూడా సంతోషంగా సాగాలని ఆలియా మరియు ఒమర్ లు ఆశపడుతున్నారట. ఈ విషయంను స్వయంగా పూజా బేడీ చెప్పుకొచ్చింది.

గత కొన్నాళ్లుగా ఈమె మనేక్ కాంట్రాక్టర్ తో పూజా ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని ఆమె ఏమాత్రం దాచి పెట్టడం లేదు. తామిద్దరం సహజీవనం సాగిస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించింది. తాజాగా అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా హింట్ ఇచ్చింది. తన ఇద్దరి పిల్లలకు వారి తండ్రితో పాటు మనేక్ అంటే కూడా చాలా ఇష్టం. వారు నా పెళ్లి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాన్న ఆంటీని పెళ్లి చేసుకుని ఒక బాబుకు తండ్రి అయ్యారు. నీవు ఎందుకు మళ్లీ పెళ్లి చేసుకోవద్దు అంటూ వారు పదే పదే నన్ను ప్రశ్నిస్తున్నారు.

వారికి మనేక్ ఇష్టం మనేక్ కూడా వారికి ఒక మంచి తండ్రిలా ఉంటాడని నాకు అనిపిస్తుంది అంటూ ఒక టాక్ షో లో ఈమె చేసిన వ్యాఖ్యలు త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందనిపిస్తుంది. సరిగ్గా అయిదు పదుల వయసు ఉన్న పూజా బేడీ పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీ వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. గతంలో ఇలాంటి పెళ్లిలు ప్రేమలు బాలీవుడ్ లో చాలానే చూశాం. కాని పూజా బేడీ పెళ్లి మాత్రం ఆమె పిల్లల బలవంతంతో జరుగబోతుందట.