వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సెటైర్లు

0

మెగా బ్రదర్ నటుడు నాగబాబు మరోసారి వివాదాస్పద అంశంపై ట్వీట్ చేసి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ తనదైన శైలిలో నాగబాబు ట్వీట్ చేశారు.

”ఆ రోజు ‘వాల్మీకి’ అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు వాల్మీకి జయంతి అని గుర్తుండే ఉంటుంది. ఏదైతేనేం.. హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు” అని నాగబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.

నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గద్దలకొండ గణేష్’ మూవీకి మొదట పెట్టిన పేరు ‘వాల్మీకి’నే. అయితే ఆ సామాజికవర్గం వారు గొడవ చేయడం.. వివాదం చెలరేగడంతో చివరిక్షణంలో పేరును మార్చారు. తాజాగా అదే విషయాన్ని గుర్తు చేస్తూ నాగబాబు ఈ సెటైరికల్ కామెంట్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది.