వామ్మోవ్ పిల్ల దెయ్యాలు.. లక్ష్మీ మంచు హాలోవీన్ ఫీట్

0

హలోవీన్.. వెస్ట్రన్ కంట్రీస్ లో బాగా పాపులర్ అయిన ఫెస్టివెల్. వింత వింత ఆకారాలతో దయ్యాలని తలపిస్తూ వింత వింత వేషాలతో వీధుల్లో తిరగడం ఆ పండగ సంప్రదాయం. ఈ పండగరోజు అంతా మంటలు వెలిగించి దయ్యాలని తరిమేయాలని ఉద్దేశంతో ఈ పండగని జరుపుకుంటారు. ఇది కేవలం వెస్ట్రన్ కంట్రీస్ కి మాత్రమే పరిమితమైన ఫెస్టివల్.

అయితే దీన్ని మన స్టార్స్ మనదాకా కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆ మధ్య మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్తేజ్.. నిహారిక ఈ ఫెస్టివెల్ ని చివరి ఏడాది జరుపుకున్నారు. వింత వింత వేషాలతో దర్శనమిచ్చి హడలెత్తించారు. ఆ ఫొటోలని ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసి షాకిచ్చారు. తాజాగా మంచు లక్ష్మి ఇదే తరహాలో తమ పిల్లలని రెడీ చేసి ఆశ్చర్యపరుస్తోంది.

తమ పిల్లలకు డెవిల్స్ గా మేకప్ చేసి హలోవీన్ ఫెస్టివల్ ని జరుపుకుంది. నిర్వాణని విచిత్రమైన గెటప్ లో సిద్ధం చేసి డెవిల్ గా మార్చేసింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్న మంచు లక్ష్మీ `ఈ ఏడాది హలోవీన్ మరింత అందంగా.. మరింత భయంకరంగా వుంది. ఎందుకంటే ఈ బాలికలు మిమ్మల్ని ఆనందపరుస్తారు` అని పోస్ట్ చేసింది.